త్రివేండ్రం : అందాల భామ కేరళ కుట్టి మమితా బైజు ఏది మాట్లాడినా అది వైరల్ అవుతోంది. ఇక సినిమా రంగంలో నటీ నటుల పేర్ల వెనుక పెద్ద కథే ఉంది. రజనీకాంత్ అసలు పేరు వేరే. ఆయనకు కె. బాలచందర్ రజనీకాంత్ అని నామకరణం చేశాడు. కొందరు నటులు న్యూమరాలజీని ఎక్కువగా నమ్ముతారు. మరికొందరు జ్యోతిష్కులు చెప్పింది వింటారు. సెంటిమెంట్కో లేదా ఇంకేవైనా కారణాల వల్ల ఒక్కొక్కరి ఒరిజినల్ పేరు, స్క్రీన్ నేమ్ వేర్వేరుగా ఉంటాయి. వాటి గురించి ఆయా నటీనటులు ఏదో ఒక సందర్భంలో ఆడియెన్స్‌తో షేర్ చేసుకుంటారు. తాజాగా మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు కూడా తన పేరు వెనుకున్న ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఆమె అసలు పేరు ‘మమిత’ కాదని చెప్పారు. అనుకోకుండా అలా తన పేరు కొనసాగుతూనే వస్తోందన్నారు.
ప్రేమలు సినిమాతో యంగ్ హీరోయిన్ మమిత బైజు తెలుగు కుర్రాళ్ల క్రష్ లిస్ట్‌లో చేరిపోయారు. అయితే ఈ పేరు విన్నప్పుడు ఇక్కడి ఆడియెన్స్‌కు కొత్తగా అనిపించింది. కానీ ఆమెకు తన తల్లిదండ్రులు చిన్నప్పుడు పెట్టిన పేరు మమిత కాదట. ఆమె పుట్టగానే పేరెంట్స్ తనకు ‘నమిత’ అని పేరు పెట్టారంట. అయితే బర్త్ సర్టిఫికెట్లో ‘నమిత’కు బదులుగా పొరపాటుగా ‘మమిత’ అని టైప్ చేశారంట. ఈ పొరపాటును ఇంట్లోవాళ్లు చాలా రోజులపాటు చూసుకోలేదట. అదే సర్టిఫికెట్తో స్కూల్ అడ్మిషన్ తీసుకోవడంతో తన పేరు మమిత గానే స్థిరపడి పోయిందని చెప్పారు. దీంతో అసలు పేరు వెనుక ఉన్న కథ చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.




