Monday, 9 November 2026

ముక్కు సర్జరీపై నోరు విప్పిన‌ జాన్వీ కపూర్

newsseals-JanhviKapoor

ముంబై : బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తన ముక్కు సర్జరీపై స్పందించింది. ఇందుకు సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టక ముందు ఆమె చేయించుకున్న ఆ సర్జరీపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. హీరోయిన్ అవుతానని మొదట్లో చెప్పినప్పుడు తల్లి శ్రీదేవికి పెద్దగా నమ్మకం లేదని జాన్వీ కపూర్ అన్నారు. పరిశ్రమలో ఉండే కష్టాలు, ఒత్తిడిని భరించగలనా అని ఆమె సందేహించారని తెలిపారు. అయితే సర్జరీ చేయించుకున్న తర్వాత తనలో హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తల్లి శ్రీదేవికి నమ్మకం కలిగిందని అన్నారు. తన ప్లాస్టిక్ సర్జరీ అంతా తన తల్లి శ్రీదేవి మార్గదర్శకత్వంలోనే చాలా జాగ్రత్తగా జరిగిందని జాన్వీకపూర్ పేర్కొన్నారు. ఈ విషయంలో తాను చాలా ఆలోచించి సరైన పద్ధతిలోనే నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు. సోషల్ మీడియా జనరేషన్​లో సెలబ్రిటీలను చూసి యువత తప్పుగా ప్రభావితం కాకూడదని జాన్వీ కపూర్ సూచించారు.

అందుకే తాను ఈ విషయాలను దాచకుండా బహిరంగంగా ఒప్పుకుంటున్నానని జాన్వీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అమ్మ శ్రీదేవి ఎప్పుడూ నా బలం. నా ప్రతి అడుగులో ఆమె ముద్ర ఉంటుంది. ఆమె నన్ను ప్రేమతో చూసుకునేది, మార్గదర్శ‌కురాలిగా ఉండేద‌ని జాన్వీ క‌పూర్ చెప్పింది. అయితే కొన్ని సార్లు సర్జరీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. దీన్ని గుర్తించి సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వీడియోలను చూసి బ్లైండ్‌గా ఫాలో అవ్వద్దని, సరైన అవగాహన లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆమె అమ్మాయిలకు హితవు పలికారు. ఒకరు తమను తాము ఎలా ఉన్నారో అలా ప్రేమించు కోవడం ముఖ్యమని ఆమె సూచించారు. ఆమె ముఖంలో వచ్చిన మార్పులపై సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతోన్న వేళ, దీనిపై జాన్వీ కపూర్ వివరణ ఇవ్వడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *