మాస్ట‌ర్ కార్డ్ వైస్ ప్రెసిడెంట్ తో నారా లోకేష్ భేటీ

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా గ‌డిపారు రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో స‌మావేశం అయ్యారు. ప్ర‌పంచంలో టాప్ కంపెనీగా పేరు పొందిన మాస్ట‌ర్ కార్డ్ కంపెనీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ లాహిరితో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు RTIH (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్)లో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు ఈ సంద‌ర్భంగా. ఇదే క్ర‌మంలో మ‌రో దిగ్గ‌జ కంపెనీ అబాట్ ఇండియా (Abbott India): MD ఇస్తేయాక్ అంజాద్‌తో స‌మావేశం అయ్యారు నారా లోకేష్ .

ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక వైద్య పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి అంజాద్ సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పారు స‌మావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడిన మంత్రి . ఇస్తేయాక్ తో చ‌ర్చించిన అనంత‌రం నారా లోకేష్ ​శాప్ (SAP) వైస్ ప్రెసిడెంట్ లవ్‌నీష్ చనానాతో చ‌ర్చ‌లు జ‌రిపారు. రాష్ట్రంలో “డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్” ఏర్పాటు చేయాలని విన్న‌వించారు. ఇదిలా ఉండ‌గా Mastercard అనేది ప్రపంచ వ్యాప్తంగా పనిచేసే ప్రముఖ payment technology company. ఇది సాధారణంగా మనకు కనిపించే బ్యాంక్ కార్డును నేరుగా జారీ చేయదు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు Mastercard network‌ను ఉపయోగించి Debit, Credit, Prepaid cards అందిస్తాయి.

  • Related Posts

    హైదరాబాద్‌కు చారిత్రాత్మకమైన రోజు : శ్రీ‌ధ‌ర్ బాబు

    హైద‌రాబాద్ : రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ ఐటీ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించి మెటా ఇండియా సౌత్ సెంట్రల్ డేటా సెంటర్ రీజియన్‌ను ప్రారంభించారు మంత్రి. ఈ సంద‌ర్భంగా…

    2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ

    అమ‌రావ‌తి : వచ్చే పదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందే ఉద్యోగ రంగాల విషయానికి వస్తే.. ఏపీలో 23 క్లస్టర్లు ఉన్నాయి. సాంప్రదాయ తయారీ రంగాలైన సిమెంట్ నుంచి ఆటోమొబైల్, మెటీరియల్ సైన్సెస్ వరకు విస్తృతమైన రంగాలు ఉన్నాయి. రాష్ట్రంలో రేర్ ఎర్త్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *