2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ

అమ‌రావ‌తి : వచ్చే పదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందే ఉద్యోగ రంగాల విషయానికి వస్తే.. ఏపీలో 23 క్లస్టర్లు ఉన్నాయి. సాంప్రదాయ తయారీ రంగాలైన సిమెంట్ నుంచి ఆటోమొబైల్, మెటీరియల్ సైన్సెస్ వరకు విస్తృతమైన రంగాలు ఉన్నాయి. రాష్ట్రంలో రేర్ ఎర్త్, మినరల్ క్లస్టర్ కూడా అభివృద్ధి చెందుతోందన్నారు నారా లోకేష్‌. బయోమెడికల్, ఫార్మా, ఏఐ, డేటా సెంటర్లు వంటి రంగాలు కూడా ఉన్నాయి. గూగుల్ ఏపీలో భారీ పెట్టుబడులు పెడుతోంది. దాని తర్వాత మరికొన్ని పెట్టుబడులు కూడా వస్తున్నాయి. క్వాంటం టెక్నాలజీ కూడా రాష్ట్రానికి వస్తోంది. అమరావతిలో క్వాంటమ్ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఐబీఎం నుంచి ప్రపంచంలోని తొలి 150-క్యూబిట్ క్వాంటం కంప్యూటర్‌ను అమరావతికి తీసుకు రావడానికి కృషిచేస్తున్నాం.

కేవలం కంప్యూటర్‌ను తీసుకు రావడమే కాదు… పూర్తి క్వాంటం ఎకోసిస్టమ్ ను నిర్మిస్తాం. తయారీ రంగం విషయానికి వస్తే.. క్రయోజెనిక్స్, మెటీరియల్ సైన్సెస్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలి. క్వాంటం టెక్నాలజీకి సంబంధించిన వినియోగాలను అభివృద్ధి చేయాలి. హాస్పిటాలిటీ రంగం కూడా అంతే ముఖ్యమైనది. రాష్ట్రంలో సుమారు 50వేల హోటల్ రూమ్ లను నిర్మిస్తున్నాం. అందువల్ల ఈ రంగంలో కూడా భారీ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం అన్నారు నారా లోకేష్.

  • Related Posts

    హైదరాబాద్‌కు చారిత్రాత్మకమైన రోజు : శ్రీ‌ధ‌ర్ బాబు

    హైద‌రాబాద్ : రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ ఐటీ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించి మెటా ఇండియా సౌత్ సెంట్రల్ డేటా సెంటర్ రీజియన్‌ను ప్రారంభించారు మంత్రి. ఈ సంద‌ర్భంగా…

    మాస్ట‌ర్ కార్డ్ వైస్ ప్రెసిడెంట్ తో నారా లోకేష్ భేటీ

    న్యూఢిల్లీ : న్యూఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా గ‌డిపారు రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో స‌మావేశం అయ్యారు. ప్ర‌పంచంలో టాప్ కంపెనీగా పేరు పొందిన మాస్ట‌ర్ కార్డ్ కంపెనీకి సంబంధించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *