Wednesday, 11 November 2026

స‌ర్వాంగ సుంద‌రంగా తమ్మిడికుంట చెరువు

newsseals-Hydraa

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని మాదాపూర్ లో సర్వాంగ సుందరంగా త‌యారైంది తమ్మిడికుంట చెరువు. దీనిని బుధ‌వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. చెరువు అభివృద్ధిలో భాగంగా ఎఫ్టీఎల్ పరిధిలోని గుడిసెలను కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పత్రాలను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అందజేశారు. ముందుగా ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్ పెద్ద చెరువులో గుడిసెలు కోల్పోయిన 34 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి సహకరించిన సినీ నటుడు అక్కినేని నాగార్జున ను మ‌ఖ్య‌ అతిథిగా ప్రారంభోత్సవానికి హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా హాస్య నటుడు శివారెడ్డి బృందం నిర్వ‌హించిన‌ ఆర్కెస్ట్రా అల‌రించింది.

ఇదిలా ఉండ‌గా హైడ్రా అభివృద్ధి చేయక ముందు తర్వాతలా తమ్మిడికుంట పరిసరాలు మారాయి. మురుగు నీటితో దుర్గంధ భరిత వాతావరణంలో ఉన్న పరిసరాలు ఇప్పుడు ఆహ్లాదంగా మారాయి. నిర్మాణ వ్యర్థాలు, చెత్త, బయో మెడికల్ వేస్ట్ డంపింగ్ యార్డుగా ఉన్న తమ్మిడికుంట ఇప్పుడు ఆ వ్యర్థాలను వదిలించుకొని పర్యావరణ హితంగా, ఆరోగ్యకరంగా మారింది. 30 వేల ట్రక్కుల కు పైగా పూడిక తొలగడంతో దుర్గంధభరిత వాతావరణం పోయింది. చెరువు చుట్ట 1.6 కిలోమీటర్ల పాత్ వే, అత్యాధునిక ఓపెన్ జిమ్, పిల్లల క్రీడా స్థలం అన్ని వయసుల వారికి ఆరోగ్య ప్రదాయినిలుగా మారాయి. తమ్మిడికుంట చెంత పరచుకున్న పచ్చదనం ఇప్పుడు ఆహ్లాదంగా మారింది. చెరువు సందర్శనకు వచ్చేవారు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన వేదిక మధ్యలో 60 ఏళ్ల బోన్సాయ్ మొక్క ఆకర్షణగా నిలిచింది. వర్షాకాలం వరద కట్టడి, భూగర్భ జలాల వృద్ధి ఇలా చెరువుకు ఉండే సహజ లక్షణాలు అన్ని సమకూరడంతో పర్యావరణహితంగా మారింది. వేలాది మొక్కలు చెరువు చుట్టూ నాటి పచ్చదనానికి ప్రాధాన్యం ఇచ్చినట్టయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *