Wednesday, 11 November 2026

వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు : సీఎం

newsseals-CM

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త్వ‌ర‌లోనే వాట‌ర్ రెగ్యులేట‌రీ క‌మిష‌న్ ఏర్పాటు చేసే ఆలోచ‌న లో ఉన్న‌ట్లు వెల్లడించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తరహాలోనే జలవనరుల రంగంలోనూ వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. పోర్టులు, విద్యుత్ రంగాల్లో ఉన్న విధంగానే సాగునీటి రంగంలోనూ నియంత్రణ వ్యవస్థను తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. గంగా-కావేరి అనుసంధానం వంటి భారీ ప్రాజెక్టుల ద్వారా రవాణా, విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు నీటి వనరులను అందుబాటులోకి తీసుకు రావచ్చని, ఆయా రంగాలకు నీటి వినియోగంపై రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు.

ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మంగా తీసుకున్న 36 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన సీఎం… నిర్దేశించుకున్న గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే రెండున్నరేళ్లలో ప్రభుత్వం నిర్దేశించుకున్న 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండ‌గా రేప‌టి నుంచి విశాఖ‌ప‌ట్ట‌ణం వేదిక‌గా సీఐఐ స‌ద‌స్సు 2026 జ‌ర‌గ‌నుంది. ఇది రెండు రోజుల‌పాటు కొన‌సాగుతుంది. దీనిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని ఇప్ప‌టికే ఏపీ స‌ర్కార్ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *