గుజరాత్ : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చే డిసెంబర్ నెలలో ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో పాల్గొనాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. క్యాంపెయిన్ లో భాగంగా ఆయన గుజరాత్ రాష్ట్రంలోని అ హ్మదాబాద్ లో పర్యటించారు. ఇక్కడ జరిగిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ రోడ్‌షో’లో పాల్గొన్నారు. ఇందులో గుజరాత్ నుండి సుమారు 400 మంది పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులు , వ్యాపార నాయకులు పాల్గొన్నారు .పలువురు వ్యాపార నాయకులతో సంభాషించారు మంత్రి శ్రీధర్ బాబు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు, టెక్నాలజీ , వ్యాపార రంగాలలో హైదరాబాద్ బలాలు, రాష్ట్ర మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి , పరిశ్రమలకు అనుకూలమైన విధానాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మేరకు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు శ్రీదర్ బాబు. వారందరినీ ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’లో పాల్గొన వలసిందిగా ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించి, తమ వ్యాపారాలను విస్తరించు కోవాలని ప్రోత్సహించారు మంత్రి. గుజరాత్ నుండి మరిన్ని వ్యాపారాలను స్వాగతించడానికి , అక్కడి పరిశ్రమలతో మన సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాం అన్నారు.




