కుల వృత్తిని అవ‌మానిస్తే ఊరుకోం

Spread the love

ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కు వార్నింగ్

అమ‌రావ‌తి : గౌడ కుల వృత్తిని కావాల‌ని కించ ప‌రిచేలా అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ను గౌడ సంఘ‌ల నేత‌లు. బీసీల‌ను ఎద‌గ‌నీయ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కూట‌మి స‌ర్కార్ కు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు త‌గిన రీతిలో బుద్ది చెబుతామ‌న్నారు. మాజీ మంత్రి జోగి ర‌మేష్ కు మీలాగా ధ‌న బ‌లం లేక పోవ‌చ్చు కానీ , త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారి బ‌లం ఉంద‌న్నారు. క‌ల్లు అమ్మ‌డం త‌మ కుల‌వృత్తి అని, అలాగ‌ని వారిని అలాగే ఉండాల‌ని కోరుకోవ‌డం త‌గ‌ద‌ని హెచ్చ‌రించారు. తాము కూడా రాజ్యాధికారం దిశగా ఎదగ కూడదా అని ప్రశ్నించారు.

ఇది మా కుల వృత్తి అని, మీలా కబ్జాలు, దందాలు చేసి ఎదిగి రాలేద‌న్నారు. త‌మ‌ కులం గురించి తక్కువ చేసి మాట్లాడిన‌ నీ లాంటి వాళ్ళ కి రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమాధి కట్టబోతున్నాం అని ఎమ్మెల్యే కృష్ణ ప్ర‌సాద్ ను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గౌడ సంఘాల నేత‌లు. కుల వృత్తి ద్వారానే ఎప్పటి నుండో ఇప్పటికీ కూడా కల్లు గీత కార్మికులు ప్రభుత్వానికి పన్ను కడుతూ ఉన్నామని అన్నారు. క‌ల్లు అమ్మడం అనేది ఆ మహా శివుడు త‌మ‌ కులానికి అందించిన వరం అని స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మార్గాన గంగాధర్ , జై గౌడ్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రంగరావ్ గౌడ్, జై గౌడ్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ గౌడ్, సుబ్రహ్మణ్యం గౌడ్, వెంకన్న గౌడ్, సూరయ్య గౌడ్ ,అంగర కిషోర్, మట్టా అనిల్ పాల్గొన్నారు.

  • Related Posts

    జ‌గ‌న్ చేసిన దుర్మార్గాల‌ను స‌రిచేస్తున్నాం

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నంద్యాల జిల్లా : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం నంద్యాల జిల్లా డోన్ లో ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా…

    చంద్రబాబును విమర్శించే అర్హత జ‌గ‌న్ కు లేదు

    Spread the love

    Spread the loveరాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : కూటమి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలతో పాటు స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుతో కళ్లెదుటే బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆ తల్లుల్లో ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *