ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కరెప్షన్ కమిటీ

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా క‌ర‌ప్ష‌న్ క‌మిటీ అంటూ మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో ఉండ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. త‌ను ఏ పార్టీలో గెలిచాడు..ఏ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నాడ‌ని ప్ర‌శ్నించాడు. మా పార్టీలో గెలిచినోళ్లను తీసుకొని, వాళ్ల పార్టీ క్యాంపెయినర్ల లిస్ట్‌లో పెట్టారంటూ ఎద్దేవా చేశారు. స్పీకర్ దగ్గరేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదు అని అబద్ధాలు చెప్తున్నార‌ని ఆరోపించారు కేటీఆర్.

కాంగ్రెస్ పార్టీ ఏం ముఖం పెట్టుకుని ఇలాంటి చిల్ల‌ర ప‌నులు చేస్తుందంటూ ప్ర‌శ్నించారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం మీరు ప్ర‌జా ప్ర‌తినిధులుగా గెలుపొందారా ఒక్కసారైనా ఆలోచించారా అని ఫిరాయింపున‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యే ల గురించి నిల‌దీశారు కేటీఆర్. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌ను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసింద‌న్నారు. అర చేతిలో స్వ‌ర్గం చూపించి ఇప్పుడు ప‌ట్టించు కోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. మ‌రో వైపు హైడ్రా పేరుతో నానా యాగీ చేస్తూ బ‌డా బాబుల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ పేద‌లు, సామాన్యుల‌ను న‌డ్డి విరుస్తున్నారంటూ ఆరోపించారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *