ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశం

అమ‌రావ‌తి : ఏపీకి రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, వాతావ‌ర‌ణ శాఖ . ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది అల్పపీడనం అని తెలిపారు. రాబోయే 36 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు ఎండీ. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు. దక్షిణ కోస్తా,రాయలసీమకు భారీవర్ష సూచన చేశారు.
అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101ను సంప్ర‌దించాల‌ని సూచించాచ‌రు.

తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంద‌న్నారు. ఎవ‌రూ కూడా చెట్ల కింద‌, శిథిల భ‌వ‌నాల వ‌ద్ద నిల‌బ‌డ‌రాద‌ని సూచించారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు. ప‌లు జిల్లాల‌లో ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని కోరారు. దీంతో రాష్ట్ర ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే త‌ప్పా మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్ల రాద‌ని సూచించారు. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.

  • Related Posts

    అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనున్న భార‌త్

    విజ‌య‌వాడ : ఒక దశాబ్దంలోనే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే అవ‌కాశం ఉంద‌న్నారు మంత్రి నారా లోకేష్‌. విజయవాడలో జరిగిన ‘పాన్-ఐఐటీ (Pan-IIT) ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026’లో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యూహం ‘3S’ మంత్రం – అంటే వేగం…

    అశ్లీల‌త‌, విద్వేషం డీఎంకే నైజం : సీఎం

    చెన్నై : డీఎంకే పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ను ఏకి పారేశారు సీఎం విజయ్. డీఎంకేను “ప్రజాస్వామ్య వ్యతిరేక” పార్టీగా అభివర్ణించారు. దాని సిద్ధాంతంలో అశ్లీలత, విద్వేషం పాతుకు పోయాయని విజయ్ ఆరోపించారు. పార్టీలో విషపూరిత…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *