తిరుపతి : : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజా, హోమ మహోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగం వైభవంగా ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు ఈ యాగ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు టీటీడీ ఆధ్వర్యంలో. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో విశేష పూజలు, నిత్యహోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీ పారాయణం, సహస్ర నామార్చన, విశేష దీపారాధన నిర్వహించనున్నట్లు పేర్కొంది టీటీడీ.
భక్తులు రూ.500 టికెట్‌తో ఒకరోజు హోమంలో గృహస్తులుగా పాల్గొనే అవకాశం కల్పించారు. పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో కుమారి దేవి, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చారు శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయానికి . ఈ సందర్బంగా నిర్వహించిన చండీయాగ మహోత్సవంలో పాల్గొని దర్శించుకున్నారు.




