Tuesday, 17 November 2026
Trending

శ్రీ‌వారి భక్తులకు ఆన్‌లైన్‌లో క్యాలెండ‌ర్లు, డైరీలు

newsseals-TTDCalenders

తిరుపతి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం సాధికారిక మండ‌లి చైర్మ‌న్, ఈవో ముద్దాడ ర‌విచంద్ర శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పారు. తిరుమ‌ల శ్రీ‌వారిని నిత్యం ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పారు. నూతన సంవత్సరం – 2027ను పురస్కరించుకుని టీటీడీ ప్రచురించిన క్యాలెండర్లు, డైరీలను భక్తులు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసేందుకు టీటీడీ సదుపాయం కల్పించిందని తెలిపారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా 2027 క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు అని వెల్ల‌డించారు.

అదేవిధంగా, తిరుపతి, తిరుమల, తిరుచానూరులోని టీటీడీ ప్రచురణల విక్రయ విభాగానికి చెందిన 12 విక్రయ కేంద్రాల్లోనూ ఈ క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ఈవో. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్‌తో పాటు విజయవాడ, చెన్నై, వెల్లూరు, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో కూడా వీటిని విక్రయిస్తున్నట్లు తెలిపారు.

కాగా, 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు 2026 సెప్టెంబరు 7వ తేదీన ఆవిష్కరించగా, అదే రోజు నుంచి విక్రయాలు ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు ఈవో. కావున భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలను టిటిడి అధికారిక వెబ్సైట్ ద్వారా బుకింగ్ లేదా టిటిడి సమాచార కేంద్రాల వద్ద కొనుగోలు చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *