Sunday, 15 November 2026

పోగొట్టుకున్న బంగారు గాజు భ‌క్తురాలికి అంద‌జేత

newsseals-TTDVigilence

తిరుమ‌ల : తిరుమలలో సీసీటీవీ నిఘా ద్వారా 40 గ్రాముల బంగారు గాజును గుర్తించారు విజిలెన్స్ సిబ్బంది. ఈ మేర‌కు స‌ద‌రు భ‌క్తురాలికి అంద‌జేశారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన శ్రీపాద రాజ శ్రుతి అనే భక్తురాలు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చింది. అనుకోకుండా ఆమె చేతి నుండి ఈ బంగారు గాజు జారి పడి పోయింది.. ప్రసాదాల పంపిణీ కేంద్రం సమీపంలోని తాగునీటి పాయింట్ వద్ద ఈ గాజు కనిపించకుండా పోయింది..సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది, ఆమె వెనుక ఉన్న మరో భక్తురాలు ఆ గాజును తీసుకోవడాన్ని గుర్తించారు..

టీటీడీ సీవీఎస్‌ఓ (CVSO) కె.వి. మురళీకృష్ణ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ బృందం వెంటనే రంగంలోకి దిగింది. విజిలెన్స్ అధికారి సురేంద్ర పర్యవేక్షణలో,ఏవీఎస్‌ఓ (AVSO) వెంకటరమణ , సిబ్బంది సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు..40 గ్రాముల బంగారు గాజును స్వాధీనం చేసుకుని, దాని అసలు యజమానురాలికి సురక్షితంగా అందజేశారు..తన విలువైన బంగారు గాజును తిరిగి ఇప్పించినందుకు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఆ భక్తురాలు కృతజ్ఞతలు తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *