Sunday, 15 November 2026

బిర్సా ముండాకు నాయకుల నివాళి

newsseals-presidentPM

న్యూఢిల్లీ : ఢిల్లీ లోని పార్లమెంటు ప్రాంగణంలో గిరిజ‌న , అడ‌వి బిడ్డ‌ల ఆరాధ్య దైవం బిర్సా ముండాకు నాయకులు ఘ‌నంగా నివాళులు అర్పించారు. హాజరుకాని కాంగ్రెస్ నేత‌ల‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని స‌జన జాతియ గౌరవ దివస్’ సందర్భంగా పార్లమెంటు భవన సముదాయంలో నాయకులు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , ఇతర నాయకులు ఆదివారం నాడు గిరిజన నాయకుడు బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కాక పోవడంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆ పార్టీని తీవ్రంగా విమర్శించింది. బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ , లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఏకి పారేశారు.

కాంగ్రెస్ నాయ‌య‌కుల‌కు గిరిజన వీరులంటే ద్వేషం అని ఆరోపించారు. పార్లమెంటులో భగవాన్ బిర్సా ముండాకు నివాళులర్పించే కార్యక్రమానికి రాహుల్ గాంధీ, అలాగే మొత్తం గాంధీ-వాద్రా కుటుంబం దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. గిరిజన నేపథ్యం నుండి వచ్చిన భారత రాష్ట్రపతిని గతంలో సోనియా గాంధీ ‘పేద మహిళ’ అని ఎలా అన్నారో గుర్తు తెచ్చుకోండి అని బీజేపీ నేత వ్యాఖ్యానించారు. 2025లో పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన అనంతరం పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు సోనియా గాంధీ. ఆ పేద మహిళ (రాష్ట్రపతి) ప్రసంగం ముగిసే సమయానికి చాలా అలసి పోయారు… పాపం ఆమె మాట్లాడలేక ఇబ్బంది పడ్డారు అని అన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘భారత్ సమ్మిట్ 2026’ విషయంలో భండారీ రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *