Sunday, 15 November 2026

గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు రావాల‌ని ప్ర‌ధానికి ఆహ్వానం

newsseals-CM

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆదివారం ప్రధాని మోదీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి . ఆయ‌న‌తో పాటు మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీ‌హ‌రి ఉన్నారు. డిసెంబ‌ర్ లో తెలంగాణ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వ‌హించ‌నుంది. ఇదే కాకుండా దేశంలో తొలిసారిగా రాజ‌ధాని కాకుండా ఇత‌ర రాష్ట్రంలో ఖేలో ఇండియా గేమ్స్ కు ప్రాతినిద్యం వ‌హిస్తోంది తెలంగాణ రాష్ట్రం. ఈ సంద‌ర్బంగా స‌మ్మిట్ తో పాటు గేమ్స్ కు హాజ‌రు కావాల్సిందిగా కోరారు సీఎం. ఇదే స‌మ‌యంలో ‘ఎల్ నినో’ ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు. కేంద్రం నుంచి సహాయం కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, వర్షాభావం, వీటి వల్ల వ్యవసాయం, రైతులు , గ్రామీణ జీవనోపాధులపై పడుతున్న ప్రతికూల ప్రభావాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానికి తెలియ జేశారు.

ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, రైతులు పడుతున్న ఇబ్బందులను తగ్గించడానికి , కరువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు తగిన ఆర్థిక సహాయం, కేంద్రం నుంచి మద్దతు అందించాలని వారు కోరారు. ‘ఎల్ నినో’ ప్రభావంతో నైరుతి రుతుపవనాల సమయంలో తగినంత వర్షపాతం నమోదు కాక పోవడంతో ఖరీఫ్ 2026 సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాల్లోని 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిందని తెలిపారు పీఎంకు సీఎం. ఇందులో 111 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా, 254 మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా గుర్తించిన‌ట్లు తెలిపారు. అలాగే,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ ‘ఖేలో ఇండియా గేమ్స్’కు ఆహ్వానించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ డిసెంబర్ 7 నుండి 9 వరకు హైదరాబాద్‌లోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *