తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా శ్రీ దక్షిణామూర్తి హోమం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాలలో విశేష పూజలు, దక్షిణామూర్తి హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన నిర్వహించారు. అనంతరం మహాశాంతి అభిషేకం, శ్రీ దక్షిణామూర్తి కలశాభిషేకం వైభవంగా చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ కాలభైరవ స్వామి వారి కలశస్థాపన, విశేష దీపారాధన నిర్వహించారు.
మంగళవారం శ్రీ కాలభైరవ స్వామి వారి హోమం ఘనంగా నిర్వహించారు ఆలయంలో . గృహస్తులు రూ.500 చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొన్నారు భక్త బాంధవులు. పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేశారు ఆలయ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో శ కుమారి దేవి, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీ కపిలేశ్వర ఆలయంలో కార్తీక మహోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం సాధికారక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు.




