Tuesday, 17 November 2026
Trending

ఇన్‌స్టాగ్రామ్ ఏఐ ప‌ర్య‌వేక్ష‌ణ మ‌రింత కఠిన‌త‌రం

newsseals-InstagramAI

వాషింగ్ట‌న్ : భారతదేశంలో సున్నితమైన కంటెంట్‌ను పరిమితం చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్ తన ఏఐ పర్యవేక్షణను కఠినతరం చేస్తోంది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకున లైంగికపరమైన సూచనలు కలిగిన పోస్ట్‌లు సిఫార్సు ఫీడ్‌లలో కనిపించకుండా ఉండేలా ఇన్‌స్టాగ్రామ్ తన ఏఐ-ఆధారిత కంటెంట్ ఫిల్టర్లను బలోపేతం చేస్తోంది. హింసాత్మక లేదా లైంగికపరమైన సూచనలున్న కంటెంట్‌ను గుర్తించి, అటువంటి పోస్ట్‌లు వినియోగదారుల సిఫార్సు ఫీడ్‌లలో తక్కువగా కనిపించేలా ఈ కొత్త ఏఐ నమూనాలు పనిచేస్తాయి. ముఖ్యంగా వినియోగదారులు ఫాలో అవ్వని ఖాతాల నుండి వచ్చే ఇటువంటి కంటెంట్‌ను పరిమితం చేయడంపైనే ఈ మార్పులు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. అయితే, దీని అర్థం అటువంటి కంటెంట్‌ను పూర్తిగా నిషేధించడం కాదు.. కేవలం ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌ల ద్వారా అటువంటి పోస్ట్‌లు వినియోగదారులకు సూచించబడే అవకాశాన్ని తగ్గించడం మాత్రమే జరుగుతుంది.

ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మెటా సంస్థకు ఒక సూచన జారీ చేసింది. తమ కంటెంట్ ర్యాంకింగ్ , సిఫార్సు వ్యవస్థలను సమీక్షించు కోవాలని కోరింది. తప్పుదారి పట్టించే లేదా మార్పులకు గురైన కంటెంట్ మెటా ప్లాట్‌ఫారమ్ సిఫార్సుల ద్వారా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన మెటా భారతీయ వినియోగదారుల నుండి అందిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, గత ఏడాది కాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేశామని పేర్కొంది. ఈ మార్పుల వల్ల ప్లాట్‌ఫారమ్‌లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని కంపెనీ తెలిపింది. మెటా వినియోగదారుల నివేదికల ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే సిఫార్సులలో కనిపించే కంటెంట్ దాదాపు సగానికి తగ్గింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *