Tuesday, 17 November 2026
Trending

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను వాయిదా వేయాలి

newsseals-AkunuriMurali

హైద‌రాబాద్ : తెలంగాణ మేధావులు భ‌గ్గుమ‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా డిసెంబ‌ర్ లో ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను నిర్వ‌హిస్తోంది. ఇందుకు సంబంధించి దేశ‌, విదేశాల నుంచి ప్ర‌ముఖుల‌ను ఇక్క‌డికి ఆహ్వానిస్తోంది. భారీ ఎత్తున ఖర్చు కూడా చేస్తోంది. దీనికి సంబంధించి ప్ర‌చారం కూడా మొద‌లు పెట్టింది. ఎలాగైనా స‌రే రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబ‌డులు రావాల‌ని కృత నిశ్చ‌యంతో ఉన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మ‌రో వైపు ఇదంతా బ‌క్వాస్ అని , ఓ వైపు ఎల్ నినో ప్ర‌భావంతో నీళ్లు లేక నానా ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలో ఇంత భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని మేధావులు, పౌర స‌మాజం, జ‌ర్న‌లిస్టులు పెద్ద ఎత్తున ప్ర‌శ్నిస్తున్నారు. సీఎం ను నిల‌దీస్తున్నారు.

ఇందుకు సంబంధించి తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను వెంట‌నే వాయిదా వేయాల‌ని కోరుతూ మేధావులు మూకుమ్మడిగా సంత‌కాల‌తో సుదీర్ఘ లేఖ రాశారు సీఎంకు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి. ఈ విష‌యంపై పున‌రాలోచించాల‌ని కోరారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను వెంటనే వాయిదా వేయాల‌ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన వారిలో 400 మందికి పైగా పౌర సమాజ నేతలు, మేధావులు ఉన్నారు. తీవ్రమైన ఎల్‌నినో కరువు ఉంద‌ని, రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 365 మండలాల్లో కరువు నెలకొన్నప్పుడు విదేశీ సదస్సులు అవసరమా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో ప్రొఫెసర్ శాంతా సిన్హా, ఆకునూరి మురళి, ఇ.ఎ.ఎస్. శర్మ తదితర ప్రముఖులు ఉన్నారు. తాజాగా రాసిన ఈ లేఖ రాజ‌కీయ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *