అక్టోబర్ 27 నుండి శ్రీనివాస కల్యాణాలు

నవంబర్ 5 వరకు శ్రీకాకుళం, అల్లూరి , అనకాపల్లి జిల్లాలలో

తిరుపతి : టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో అక్టోబర్ 27 నుండి నవంబర్ 5 వరకు శ్రీకాకుళం జిల్లాలో 2 ప్రాంతాలలో, అల్లూరి సీతారామ రాజు జిల్లాలో 2 ప్రాంతాలలో, అనకాపల్లి జిల్లాలో 1 ప్రాంతంలో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు జిల్లాలలో ఉదయం 11 గంటలకు, అనకాపల్లి జిల్లాలో సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి . అక్టోబర్ 27వ తేదీన శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మండల కేంద్రంలోని అగ్రహారం గ్రౌండ్ లో ఉదయం 11 గం.లకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది. 30వ తేదీన అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరు మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 11 గం.లకు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. నవంబర్ 01వ తేదీన అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతపల్లి మండలం లోని గొందిపాకాల (లంబ సింగి) గ్రామంలోని శ్రీ నూకాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఉదయం 11 గం.లకు శ్రీవారి కల్యాణం జరుగనుంది.

3వ తేదీన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ లో సాయంత్రం 6 గం.లకు శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు. నవంబర్ 5వ తేదీన శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండల కేంద్రంలోని జీ.టీ.డబ్ల్యూ.ఏ హైస్కూల్ గ్రౌండ్ లో ఉదయం 11 గం.లకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో హరికథ, సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

  • Related Posts

    ప‌ద్మావ‌తి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి

    భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు.…

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *