20 శాతం కమీషన్ తీసుకుంటూ పట్టుబడ్డాడు
యాదాద్రి భువనగిరి జిల్లా : అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కాడు దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన ఇంఛార్జ్ ఎస్ఈ రామారావు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ SE గా బాధ్యతలు స్వీకరించారు. యాదగిరిగుట్టలో లడ్డు కౌంటర్లు టెండర్ ద్వారా మిషనరీ సప్లై చేసిన కాంట్రాక్టర్ . మిషనరీ ఖరీదు 11,50,000 ఆ బిల్లు ఇప్పించడానికి 20% కమిషన్ డిమాండ్ చేశాడు. ఇద్దరి మధ్యలో ఒక లక్ష 90 వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. కాంట్రాక్టర్ ఏసీబీ వాళ్ళని కలవడంతో నిఘా పెట్టారు నల్గొండ ఏసీబీ అధికారులు . రామారావు ఆడియో కాల్స్ డేటాను సేకరించి మేడిపల్లిలో నిన్న సాయంత్రం 1,90,000 ఇస్తుండగా పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్ గా.
రామారావు కు సంబంధించిన యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తనకుహైదరాబాదులోని ఎల్బీనగర్ లో ఉన్న ఇంటిపై కూడా రెండు టీములుగా ఏర్పడి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సోదాలు, తనిఖీలు పూర్తి అయ్యాక అన్నీ తెలిసే ఛాన్స్ ఉందన్నారు ఏసీబీ డీఎస్పీ. ఇదిలా ఉండగా పట్టుబడిన ఎస్ఈ రామారావును జ్యూడిషల్ రిమాండ్ కొరకు నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నలగొండ జిల్లా ప్రజలకు ఏదైనా సమాచారం వెంటనే తమకు తెలియ చేయాలని కోరారు డీఎస్పీ.







