తుపాను కార‌ణంగా రూ. 20 వేల కోట్ల న‌ష్టం

ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిల

అమ‌రావ‌తి : రాష్ట్రంలో మొంథా తుపాను దెబ్బ‌కు పెద్ద ఎత్తున న‌ష్టం జ‌రిగిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. 20 ల‌క్ష‌ల హెక్టార్ల‌కు పైగా రైతులకు న‌ష్టం వాటిల్లింద‌న్నారు.
వేరుశెనగ 1.50 లక్షల ఎకరాలు..మొక్క జొన్న 2.50 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందన్నారు. తుఫాన్ కారణంగా దాదాపు 20 వేల కోట్ల నష్టం వాటిల్లింద‌న్నారు. రాష్ట్రంలో రైతులు తీర్వ ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు. కూటమి పాలనలో పండిన పంటకు సైతం గిట్టుబాటు లేదన్నారు. ఒక్కో ఎకరాకు రైతు దాదాపు 35 వేల వరకు పెట్టుబడి పెట్టారని అన్నారు. ఇప్పుడు మొత్తం పోయిందని బాధ పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతాంగానికి ఇంత నష్టం జరిగితే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మ‌దీ నోరు విప్ప లేద‌ని మండిప‌డ్డారు.

మోడీ రాష్ట్రానికి వ‌స్తున్నారు వెళుతున్నార‌ని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన హామీలు ఏవీ అమ‌లుకు నోచుకోలేద‌న్నారు. కానీ రాష్ట్ర సమస్యల మీద మాత్రం మాట్లాడక పోవ‌డం దారుణ‌మ‌న్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఇప్పటికే రాష్ట్ర హక్కుల మీద అన్ని రకాలుగా మోసం చేశారని వాపోయారు. మోడీకి మోసం చేయడం అలవాటు గా మారితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూసి మురిసి పోతున్నారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ నిలబడి ఉంది అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మద్దతుతోనేన‌న్న విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. ఆంధ్ర రాష్ట్రం అంటే కేవలం ఓట్లు మాత్రమేన‌న్న అభిప్రాయం ఉంద‌న్నారు. రాష్ట్రంలో ఉచిత పంట బీమా పథకానికి దిక్కు లేదన్నారు. గత YCP పాలనలో మూడేళ్లు బీమా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం ఉచిత భీమా అమలు చేయడం లేదని ఆరోపించారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *