మైదానంలో టామీతో కలిసి ప్రాక్టీస్
ముంబై : అందరి కళ్లు ఇప్పుడు భారత క్రికెట్ జట్టు అమ్మాయిలపైనే ఉంది. ఆదివారం ముంబై బీవై పాటిల్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు వేదిక కానుంది. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఇదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియా మహిళా జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది భారత జట్టు. ఇందులో కీలక పాత్ర పోషించింది ముంబైకి చెందిన జెమీమా రోడ్రిగ్స్. తను ఒక్కతే ఒంటరి పోరాటం చేసింది. ఆట చివరి దాకా నిలిచింది. జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ప్రస్తుతం మైదానంలో భారత క్రికెటర్లు ఫుల్ ప్రాక్టీస్ చేశారు.
మరోసారి జెమీమా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. తనతో పాటు తమ కుటుంబంలో కలిసి పోయిన టామీ (కుక్క)ని కూడా వెంట తెచ్చుకుంది. ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది భారత జట్టు. ఇరు జట్లలో ఎవరు గెలిచినా కొత్త వారే కప్ ను ఎగరేసుకుంటారు. విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు వరల్డ్ కప్ ను చేజిక్కించు కోలేదు. భారత జట్టు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో బ్యాటింగ్ పరంగా బలంగా ఉంది. స్మృతీ మంధన్నా, షెఫాలీ వర్మ, జెమీమాతో పాటు ఆఖరి దాకా అందరూ బ్యాటర్లే కావడం విశేషం. ప్రకృతి గనుక సహకరిస్తే ఇండియా గెలిస్తే దానికి మించిన ఆనందం ఏముంటుంది. ఇక బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది. భారత అమ్మాయిలు గనుక కప్ సాధిస్తే భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది.








