అంద‌రి క‌ళ్లు జెమీమా రోడ్రిగ్స్ పైనే

Spread the love

మైదానంలో టామీతో క‌లిసి ప్రాక్టీస్

ముంబై : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు భార‌త క్రికెట్ జ‌ట్టు అమ్మాయిల‌పైనే ఉంది. ఆదివారం ముంబై బీవై పాటిల్ వేదిక‌గా ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు వేదిక కానుంది. ఇప్ప‌టికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఇదే స‌మ‌యంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఏడుసార్లు ప్ర‌పంచ ఛాంపియ‌న్ గా నిలిచిన ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది భార‌త జ‌ట్టు. ఇందులో కీల‌క పాత్ర పోషించింది ముంబైకి చెందిన జెమీమా రోడ్రిగ్స్. త‌ను ఒక్క‌తే ఒంట‌రి పోరాటం చేసింది. ఆట చివ‌రి దాకా నిలిచింది. జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చింది. ఇవాళ జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది. ప్ర‌స్తుతం మైదానంలో భార‌త క్రికెట‌ర్లు ఫుల్ ప్రాక్టీస్ చేశారు.

మ‌రోసారి జెమీమా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. త‌న‌తో పాటు త‌మ కుటుంబంలో క‌లిసి పోయిన టామీ (కుక్క‌)ని కూడా వెంట తెచ్చుకుంది. ఫైన‌ల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది భార‌త జ‌ట్టు. ఇరు జ‌ట్ల‌లో ఎవ‌రు గెలిచినా కొత్త వారే క‌ప్ ను ఎగ‌రేసుకుంటారు. విచిత్రం ఏమిటంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఇరు జ‌ట్లు వ‌ర‌ల్డ్ క‌ప్ ను చేజిక్కించు కోలేదు. భార‌త జ‌ట్టు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలో బ్యాటింగ్ ప‌రంగా బ‌లంగా ఉంది. స్మృతీ మంధ‌న్నా, షెఫాలీ వ‌ర్మ‌, జెమీమాతో పాటు ఆఖ‌రి దాకా అంద‌రూ బ్యాట‌ర్లే కావ‌డం విశేషం. ప్ర‌కృతి గ‌నుక స‌హ‌క‌రిస్తే ఇండియా గెలిస్తే దానికి మించిన ఆనందం ఏముంటుంది. ఇక బీసీసీఐ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త అమ్మాయిలు గ‌నుక క‌ప్ సాధిస్తే భారీ నజ‌రానా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.

  • Related Posts

    త‌ట‌స్థ ప్ర‌దేశాల‌లోనే మ్యాచ్ లు ఆడుతాం

    Spread the love

    Spread the loveఐసీసీకి స్ప‌ష్టం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా తాము ఇండియాలో జ‌రిగే కీల‌క మ్యాచ్ ల‌ను…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 బ‌రువు 6,175 కిలోలు

    Spread the love

    Spread the love18 క్యారెట్ బంగారంతో ట్రోఫీ త‌యారీ న్యూఢిల్లీ : అమెరికా వేదిక‌గా ఈ ఏడాది ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే మిలియ‌న్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఈసారి ట్రోఫీని కోకో కోలా స్పాన్స‌ర్ చేస్తోంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *