మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కీలక కామెంట్స్
ముంబై : భారత మహిళా జట్టు మాజీ స్కిప్పర్ మిథాలీ రాజ్ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా క్రికెట్ లో రాణిస్తున్నారని , ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ భారత మహిళా జట్టు వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవడమేనని పేర్కొన్నారు. ఇండియా కప్ గెలిచాక మీడియాతో మాట్లాడారు మిథాలీ రాజ్. ఇదే సమయంలో దేశంలో మహిళల క్రికెట్‌ను పెంపొందించడంలో బీసీసీఐ ఇచ్చిన మద్దతు మరిచి పోలేమన్నారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిందని పేర్కొన్నారు. ఇందు వల్లనే ఉమెన్ ఇన్ బ్లూ అన్ని రంగాలలో సత్తా చాటారని అన్నారు. తాము చేయలేని పనిని ఇప్పుడున్న మహిళా క్రికెటర్లు చేశారని, సాధించారని ప్రశంసలు కురిపించారు మిథాలీ రాజ్.
2005, 2017లో భారత జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్లింది. కానీ అదృష్టం తమ వైపు ఉండలేదన్నారు . కానీ 2025లో హర్మన్ ప్రీత్ కౌర్ పటిష్టవంతమైన నాయకత్వంలో భారత జట్టు అద్భుతం చేసిందన్నారు. కళ్ల ముందు కాదనుకున్న దానిని ఆచరణలో చేసి చూపించారంటూ పేర్కొంది మాజీ కెప్టెన్. ఆనాడు ఇంగ్లండ్ చేతిలో తాము ఓడి పోవడం ఇప్పటికీ బాధ కలిగిస్తోందని చెప్పారు. ఆట అన్నాక గెలుపు ఓటములు సహజమన్నారు. ఇదే సమయంలో ఏడుసార్లు ఛాంపియన్ గా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించిన తీరు అద్బుతమన్నారు. ఇదే సమయంలో ప్రతి ఒక్కరు దేశం కోసం ఆడారని, అనుకున్నది సాధించారని చెప్పారు.








