క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణికి సీఎం అభినంద‌న

చంద్రబాబుతో భేటీ అయిన మిథాలీ రాజ్

అమ‌రావ‌తి : ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ గెలుచుకున్న భార‌త జ‌ట్టు క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణితో పాటు భార‌త జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ మిథాలీ రాజ్ శుక్ర‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో. వీరితో పాటు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించ‌డంలో ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ‌చ‌ర‌ణి ఉండ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. సీఎం క్యాంపు కార్యాల‌యంలో త‌న‌ను క‌లుసుకున్న సంద‌ర్బంగా ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాలు సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాల‌ని ఆకాంక్షించారు.

ఈ సంద‌ర్బంగా త‌మ స‌ర్కార్ క్రీడాకారుల‌కు, ప్ర‌త్యేకించి క్రికెట్ కు పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇదే స‌మయంలో రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందుకు సంబంధించి 2047 ఏపీ స్వ‌ర్ణాంధ్ర విజన్ ను కూడా రూపొందించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అద్భుతంగా ప్ర‌తిభా నైపుణ్యంతో ఆక‌ట్టుకునేలా ఆడార‌ని, జాతి యావ‌త్తు వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవ‌డం అద్భుత‌మ‌న్నారు. భ‌విష్య‌త్తులో కోట్లాది మంది యువ‌త‌కు మీరు ఆద‌ర్శ ప్రాయంగా నిలుస్తార‌ని పేర్కొన్నారు సీఎం. ఇదిలా ఉండ‌గా ముంబై వేదికగా జ‌రిగిన ఫైన‌ల్ లో 5 వికెట్ల తేడాతో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టును ఓడించింది. విశ్వ విజేత‌గా నిలిచింది.

  • Related Posts

    బాబ‌ర్ ఆజమ్ కు భారీ జ‌రిమానా

    ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి ఉల్లంఘ‌న రావ‌ల్పిండి : పాకిస్తాన్ జ‌ట్టు మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను త‌న‌కు భారీ జ‌రిమానా విధించింది ఐసీసీ. అతని క్రమశిక్షణా రికార్డులో ఒక…

    చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి జ‌డేజా, శామ్ క‌ర‌న్ చెన్నై : ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అంశం. ఏ జ‌ట్టులోకి త‌ను వెళ‌తాడ‌నేది క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *