స్పష్టం చేసిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్
బీహార్ : డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే బీహార్ లో అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఆయన బీహార్ లో సీఎం నితీష్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో , రాష్ట్రంలో సమర్తవంతమైన నాయకత్వం ఉందన్నారు. ఓ వైపు నితీష్ కుమార్ ఇంకో వైపు మోదీ ఇద్దరూ రాజకీయ పరంగా అనుభవం కలిగిన వారన్నారు. ఇప్పటికే 12 సార్లు ఇక్కడికి వచ్చి వెళ్లారని చెప్పారు నారా లోకేష్.
ఆయన అంతకు ముందు బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సమర్థుడైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాలలో పరుగులు తీస్తోందని చెప్పారు. దేశంలోనే ఏపీని నెంబర్ వన్ గా చేస్తామన్నారు. ఇప్పటికే ఐటీ, లాజిస్టిక్ హబ్ గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు నారా లోకేష్. ఇటీవలే ప్రపంచంలోనే దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ తన ఏఐ హబ్ ను విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిందన్నారు.






