టెక్నాల‌జీలో సంచ‌ల‌నం ఏఐ కీల‌కం

Spread the love

స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్

విశాఖ‌ప‌ట్నం : యావ‌త్ ప్ర‌పంచాన్ని రాబోయే కాలంలో ఏఐ శాసిస్తుంద‌ని అన్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. AI and the Future of Jobs Turning Disruption into Opportunity అనే అంశంపై సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ ప్రాంగణంలో జరిగిన సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని AI గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఈజ్ ఇండియా రెడీ ఫర్ అథెంటిక్ ఏఐ’ నివేదికను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అనంతరం నారా లోకేష్ సమక్షంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ, సీఐఐ వైస్ ప్రెసిడెంట్ సుచిత్ర కె.ఎల్లాతో సీఐఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక భ‌విష్య‌త్తు అంతా ఏఐ చేతుల్లోనే ఉంటుంద‌న్నారు మంత్రి లోకేష్‌.

ఇదిలా ఉండ‌గా గత రెండు రోజులలో మొత్తం రూ. 5,22,471 కోట్ల పెట్టుబడులు, 2,67,239 ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా భారీ ఎంఓయూలు కుదిరాయని తెలిపారు. విండ్–సోలార్ హైబ్రిడ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, బయోఫ్యూయల్స్, పంప్డ్ హైడ్రా స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, అగ్రివోల్టాయిక్స్, పునరుత్పాదక ఇంధన తయారీ వంటి ఆధునిక రంగాల వైపు ప్రపంచ దిగ్గజ సంస్థల ఆసక్తి రాష్ట్ర సామర్థ్యాన్ని మరోసారి నిరూపించిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంలో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 024 ఏపీ పునరుత్పాదక ఇంధన రంగానికి నిజమైన గేమ్ ఛేంజర్గా నిలుస్తోంద‌న్నారు.

  • Related Posts

    రైతుల సంక్షేమం స‌ర్కార్ ల‌క్ష్యం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : త‌మ ప్ర‌భుత్వం రైతు సంక్షేమం కోసం ప‌ని చేస్తుంద‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమం, రైతు క్షేత్రం…

    తెలంగాణ పాలిట శాపంగా మారిన సీఎం

    Spread the love

    Spread the loveఅస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పాలిట శాపంగా మారాడ‌ని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. శ‌నివారం ఆయ‌న మీడియాతో హైద‌రాబాద్ లో మాట్లాడారు. ఈరోజు శాంతి ర్యాలీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *