సమక్షంలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం
విశాఖపట్నం : విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాలతో ఏపీ టెక్స్ టైల్స్ రంగానికి ఊతం లభించిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టెక్స్ టైల్స్ విధానంతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారన్నారు. వారేకాక మరింత మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ పరిశ్రమలను ఆరు నెలల్లో నెలకొల్పనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ఏపీలో రూ. 4వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రి సవిత సమక్షంలో ప్రభుత్వంతో ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. టెక్స్‌టైల్ రీసైక్లింగ్ టెక్నాలజీని ఈ సంస్థ భారత్ కు తొలిసారి తీసుకు వస్తోంది. మొత్తం ఏడు ఒప్పందాల ద్వారా ఏపీ టెక్స్ టైల్స్ రంగంలో రూ. రూ.4,380.38 కోట్ల మేర పెట్టుడులు తరలి వచ్చాయి. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 6,100 ఉద్యోగాలు రానున్నాయి.






