బ‌తికి ఉన్నంత వ‌ర‌కు ఎమ్మెల్యేగా పోటీ చేయ‌ను

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన టీపీసీసీ నేత జ‌గ్గారెడ్డి

హైద‌రాబాద్ : టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను బ‌తికి ఉన్నంత వ‌ర‌కు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నంటూ ప్ర‌క‌టించారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు. రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి ఇన్సల్ట్ చేశానేమోన‌ని తాను ఫీల్ అయ్యాన‌ని వాపోయారు. త‌న కోసం ప్ర‌త్యేకంగా వ‌చ్చారు. నా అభిమానంతో ఆయ‌న నా పిలుపును అందుకుని ప్ర‌త్యేకంగా ఇక్క‌డికి వ‌చ్చారు. ఆపై త‌న‌ను గెలిపించాల‌ని కోరారు . కానీ జ‌నం త‌న‌ను న‌మ్మ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. తాను ఊహించ లేద‌ని పేర్కొన్నారు. త‌న‌ను ఓడించడంతో చాలా బాధ ప‌డ్డాన‌ని తెలిపారు.

నా భుజం పై చేయి వేసి జగ్గారెడ్డిని గెలిపించాలని అడుగుతే నన్ను ఇక్కడి వారు ఓడించడం ఇప్ప‌టికీ జీర్ణించు కోలేక పోతున్నాన‌ని చెప్పారు. నా జీవితంలో ఇది మరిచి పోలేనిద‌ని అన్నారు జ‌గ్గారెడ్డి. నా ఓటమికి కారణం పేద ప్రజలు కాదు, ఇక్కడి మేధావులు, పెద్ద‌లు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆయ‌న తాజాగా చేసిన కామెంట్స్ ఇటు పార్టీలో సంగారెడ్డిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాను కులాలు, మ‌తాల‌కు అతీతంగా, రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి ప‌ని చేస్తూ వ‌చ్చాన‌ని చెప్పారు. అయినా ప్ర‌జ‌లు త‌న‌ను న‌మ్మ‌క పోవ‌డం అనేది ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేద‌న్నారు జ‌గ్గారెడ్డి. రేపు సంగారెడ్డిలో నా భార్య నిర్మలా జ‌గ్గారెడ్డి పోటీ చేసిన కూడా నేను ప్రచారానికి రానంటూ ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో నేను ఎక్కడికైన వెళ్లి ప్రచారం చేస్తా.. కానీ, సంగారెడ్డిలో ప్రచారం చేయనంటూ పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *