బీహార్ లో ఎన్నిక‌ల సంఘానికి కంగ్రాట్స్

Spread the love

షాకింగ్ కామెంట్స్ చేసిన ఆదిత్యా ఠాక్రే
ముంబై : బీహార్‌లో ఎన్డీఏ అఖండ విజయంపై శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్క‌డ మ‌రోసారి ఎన్డీయే స‌ర్కార్ విజ‌యం సాధించేలా స‌పోర్ట్ చేసినందుకు, ప్ర‌జాస్వామ్యాన్ని పాత‌ర వేసినందుకు ఎన్నికల సంఘానికి ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలియ చేస్తున్నానంటూ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆదిత్యా ఠాక్రే మీడియాతో మాట్లాడారు. వారి యజమానులైన బిజెపికి 65 లక్షల మంది ఓటర్లను కోసే SIR ప్రయోగం విజయవంతమైందని అన్నారు. బిజెపి ఆట కారణంగా నితీష్ కుమార్ నిజంగా ముఖ్యమంత్రి అవుతాడా అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేమ‌న్నారు.

బిజెపిని దగ్గరగా చూసినందున ఆయన అప్రమత్తంగా ఉండాలని నేను సూచిస్తున్నానని అన్నారు. మహిళల కోసం పథకాలు వారి ఓట్లను ప్రభావితం చేస్తాయని నేను నమ్మను అని చెప్పారు ఆదిత్యా ఠాక్రే. మహిళలు ఎప్పుడూ ఎవరికి ఓటు వేస్తారనే దాని గురించి ఆలోచిస్తారు. వాస్త‌వానికి బీహార్ లో వారు ఓటు వేయలేదు, ‘నోట్లు’ వైపు చూస్తూనే ఉన్నారని అన్నారు. వారు (ఎన్డీఏ) ఓటు-చోరి ద్వారా తమ విజయాన్ని సమర్థించు కోవడానికి ‘లాడ్లీ బెహ్నా’ పథకం సాకును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ మ్యాజిక్ ఎన్నికల సంఘం వల్ల జరిగిందని మండిప‌డ్డారు. భార‌త ఎన్నిక‌ల సంఘం కాద‌ని బీజేపీ ఎన్నిక‌ల సంఘం అని పేర్కొన్నారు.

  • Related Posts

    రాధాకృష్ణా నీ పాపం పండే రోజు వ‌చ్చింది

    Spread the love

    Spread the loveఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి హైద‌రాబాద్ : వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి నిప్పులు చెరిగారు. స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా మ‌హిళ‌ల ప‌ట్ల అనుచిత రాత‌లు రాయ‌డం, ప్ర‌సారం చేయ‌డం…

    ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ రాజీనామా

    Spread the love

    Spread the loveకీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న వైనం ముంబై : టాటా గ్రూప్ సంస్థ‌కు చెందిన ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ గా ఉన్న విల్స‌న్ త‌న ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2024లోనే ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *