ఇది ముమ్మాటికీ ప‌త్రికా స్వేచ్ఛ‌పై దాడి

మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ ఆల‌పాటి

అమ‌రావ‌తి : వైసీపీ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో వేమూరి రాధాకృష్ణ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌, ఏబీఎన్ చాన‌ల్ కార్యాల‌యంపై దాడికి దిగ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు ఏపీ మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ ఆల‌పాటి సురేష్ కుమార్. మంగ‌ళ‌వారం ఆయ‌న సామాజిక వేదిక‌గా స్పందించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. పూర్తిగా ప్ర‌జాస్వామ్యంపై , మీడియా స్వేచ్ఛ‌పై జ‌రిగిన ఏక‌ప‌క్ష దాడిగా పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి ఒక్క‌రికీ త‌మ అభిప్రాయాల‌ను పంచుకునే లేదా వ్య‌క్తం చేసే స్వేచ్ఛ ఉంటుంద‌న్నారు. ఆ విష‌యం తెలుసుకోకుండా ఇలాంటి దాడుల‌కు దిగ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు ఆల‌పాటి సురేష్ కుమార్.

ఏబీఎన్, ఆంధ్ర‌జ్యోతి యాజ‌మాన్యం లేదా ఓన‌ర్ , చైర్మ‌న్ గ‌నుక వ్య‌క్తిగ‌తంగా ఇబ్బంది పెట్టేలా వార్త‌లు రాసినా లేదా ప్ర‌సారం చేసినా వాటిపై అభ్యంత‌రం తెలియ చేయ‌వచ్చ‌ని, ఇదే క్ర‌మంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు ఫిర్యాదు చేయొచ్చ‌ని, ఆ అవ‌కాశం కూడా ఉంద‌ని పేర్కొన్నారు. కానీ ఇవేవీ చేయ‌కుండా దాడికి దిగ‌డం అత్యంత ప్ర‌మాదాన్ని సూచిస్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ దాడిని ప్ర‌తి ఒక్క‌రూ, ప్రజాస్వామిక‌వాదులు ఖండించాల‌ని కోరారు. మీడియా పై దాడి అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్య ప్రక్రియలో నమ్మకం వున్నా రాజకీయ శక్తులు భౌతిక దాడులకు తెగబడవని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *