కాంగ్రెస్ సర్కార్ కు స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహమత్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కేటీఆర్. రాజకీయాలలో గెలుపు ఓటములు అత్యంత సహజమని, ఆ విషయం సీఎం తెలుసుకుంటే మంచిదన్నారు. రౌడీయిజం చేయడం, దొంగ ఓట్లు వేయించడం, కోట్లాది రూపాయలు పంచి పెట్టడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడని ఆరోపించారు. ఈ విజయం పార్టీది కాదన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేయడం పట్ల మండిపడ్డారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు కేటీఆర్.
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నా ఏనాడూ ఇలా దాడులకు పాల్పడ లేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ చేస్తున్న రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, ఎల్లకాలం ఇది చెల్లుబాటు కాదని అన్నారు. తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. తమ కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చశారు. తాను అహంకారం తగ్గించు కోవాలన్న రేవంత్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇకనైనా గూండాగిరీకి చెక్ పెట్టాలని లేక పోతే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు.






