డిసెంబర్ లో జరిగే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలి
హైదరాబాద్ : విన్‌గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ హైదరాబాద్ లో సీఎం ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. తమ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైదని, వెంటనే ఇన్వెస్ట్ చేయాలని సీఎం తనను కోరారు. ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ,బ్యాటరీ నిల్వ, పునరుత్పాదక శక్తి , భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులను పరిశీలిస్తుందని తెలిపారు సీఎం. డిసెంబర్ 8–9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో పాల్గొనమని రాష్ట్రం తరపున ఫామ్ సాన్ చౌ, విన్‌గ్రూప్ చైర్మన్ శ్రీ ఫామ్ నాట్ వుయాంగ్‌లకు అధికారిక ఆహ్వానాన్ని అందించినట్లు తెలిపారు రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందన్నారు. అంతే కాకుండా ఇప్పటికే తెలంగాణ రైజింగ్ లో ఉందని, దేశంలోనే నెంబర్ వన్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు సీఎం. ఇప్పటికే ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, తదితర రంగాలలో హైదరాబాద్ వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిందని చెప్పారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే వారికి తాము ఎర్ర తివాచీ పరుస్తామన్నారు రేవంత్ రెడ్డి.






