ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం అన్న‌దాత‌లు ఆగ‌మాగం

ఆవేద‌న వ్య‌క్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్

ఆదిలాబాద్ జిల్లా : ప‌త్తి రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో రేవంత్ రెడ్డి స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ప‌ట్ట‌ణంలోని మార్కెట్ యార్డును సంద‌ర్శించారు కేటీఆర్. ఈ సంద‌ర్బంగా రైతుల‌తో ముచ్చ‌టించారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డం లేదంటూ వాపోయారు. దీనిపై తీవ్రంగా స్పందించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి 20-22% తేమ ఉన్న పంటను కూడా కొనేలా చేశామ‌న్నారు. కానీ ఇప్పుడు కేవలం 12% తేమ ఉంటే కూడా కొనుగోలు చేయలేమంటూ చేతులు ఎత్తేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేటీఆర్. రైతులు పంటలు అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టించుకునే వారు లేకుండా పోయార‌న్నారు.

కనీసం ఇప్పటి దాకా లక్ష క్వింటాళ్ల పంట కూడా కొన లేద‌న్నారు. ప్రైవేట్ వాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కు అయ్యి రైతుల పంటను దోచుకుంటున్నది అని అనిపిస్తున్నదన్నారు. కనీస మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు రైతుకు దక్కాల్సింది కానీ ఐదు ఆరు వేలు కూడా దక్కడం లేదన్నారు. సోయాబీన్ అమ్మకానికి సంబంధించి ఫింగర్ ప్రింట్ కావాలని చెప్పి ఒక నిబంధన పెట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని వాపోయారు. పత్తి పంట ఎకరానికి కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే కొంటామని అర్ధ‌ర‌హిత‌మైన రూల్ పెట్టారంటూ మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు సరఫరా నుంచి మొదలుకొని యూరియా సప్లయ్ దాకా చివరికి పంట అమ్మకానికి సంబంధించి కూడా తీవ్రమైన సమస్యలు ఉన్నాయని వాపోయారు.

  • Related Posts

    విద్య‌తోనే వికాసం అభివృద్దికి సోపానం

    స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి అమ‌రావ‌తి : జీవితాన్ని ప్ర‌భావితం చేసేది ఒక్క‌టేన‌ని అది విద్య అని గుర్తించాల‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. చ‌దువుతోనే మ‌నిషిలో సంస్కారం అల‌వ‌డుతుంద‌ని అన్నారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని,…

    రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం

    స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు అత్యంత స‌హ‌జ‌మ‌ని , కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జ‌రిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *