స‌చివాల‌య ఉద్యోగుల‌కు ఆరోగ్యం ముఖ్యం

ప్రారంభించిన మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహా

హైద‌రాబాద్ : ఉద్యోగుల‌కు విధుల‌తో పాటు ఆరోగ్యం కూడా ముఖ్య‌మేన‌ని అన్నారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహా. బుధ‌వారం హైదరాబాద్ లోని డా. B R అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని మూడో అంతస్థులో సెక్రటేరియట్ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం రేనోవా హాస్పిటల్స్ అద్వర్యం లో ఏర్పాటు చేసిన AI Based మెగా కార్డియాక్ హెల్త్ క్యాంపు ను ప్రారంభించారు.

ఈ హెల్త్ క్యాంపు లో సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆద్వర్వం లో వచ్చిన ఉద్యోగులకు రేనోవా హాస్పిటల్ అద్వర్యం లో వచ్చిన వైద్య సిబ్బంది అత్యాధునిక ఎక్విప్ మెంట్ సాయం తో BP , GRBS , ECG , 2D Echo పరీక్షలను నిర్వహించారు . కార్డియాలజీ , జనరల్ ఫీజిషన్ సేవలను free కన్సల్టేషన్ సేవలను ఉద్యోగులకు అందించారు .

ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడారు..మారుతున్న జీవన శైలిలలో భాగంగా ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలన్నారు . ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంద‌న్నారు. సచివాలయ ఉద్యోగులకు హెల్త్ క్యాంపు పెట్టి వైద్య సేవలను , పరీక్షలను ఉచితంగా అందించిన రేనోవా ఆసుపత్రి వైద్య సిబ్బంది ని మంత్రి దామోదర్ రాజనర్సింహా అభినందించారు.

  • Related Posts

    విద్య‌తోనే వికాసం అభివృద్దికి సోపానం

    స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి అమ‌రావ‌తి : జీవితాన్ని ప్ర‌భావితం చేసేది ఒక్క‌టేన‌ని అది విద్య అని గుర్తించాల‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. చ‌దువుతోనే మ‌నిషిలో సంస్కారం అల‌వ‌డుతుంద‌ని అన్నారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని,…

    రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం

    స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు అత్యంత స‌హ‌జ‌మ‌ని , కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జ‌రిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *