పిలుపునిచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్ : డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మాదకద్రవ్యాల బారిన పడి యువత విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాబోయే రోజుల్లో డ్రగ్స్, మాదక దవ్యాల బారిన పడకుండా కఠిన చర్యలకు ఉపక్రమించామని, ఇందులో భాగంగానే ఈగల్ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మంత్రి. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి స్కూల్స్, పాఠశాలలు, విశ్వ విద్యాలయాలలో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు అడ్లూరి లక్ష్మణ్.
ఈ కార్యక్రమంలో ఉమెన్, చైల్డ్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి అనితా రామచంద్రన్, టీజీ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సీనియర్ సిటిజన్ , ట్రాన్స్‌జెండర్ విభాగం డైరెక్టర్ శైలజ, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జాయింట్ సెక్రెటరీ శ్రీకాంత్, గాంధీ హాస్పిటల్ సూపరిండెంటెంట్ డాక్టర్ వాణి, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సీతారాం తదితరులు పాల్గొన్నారు.






