పంపిణీ చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే తమ సర్కార్ పేదలకు సన్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇదే సన్న బియ్యాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలలో పంపిణీ చేయాలని కేంద్ర సర్కార్ కు సూచించారు. గురువారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు సీఎం. ఈ పథకాన్ని అధ్యయనం చేసి దేశం మొత్తం అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు.
ఇందుకు రేవంత్ రెడ్డి చేసిన సూచనలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి కూడా వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు బస్సులను ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు 151 బస్సులు ఇవ్వడం జరిగిందన్నారు. వారికి స్థిరమైన ఆదాయం వచ్చేలా చేశామన్నారు సీఎం. ప్రతి నెలా దాదాపు 69 వేలకు పైగా అద్దె వస్తోందన్నారు. ఆర్థికంగా బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





