స్పష్టం చేసిన నారా భువనేశ్వరి
అమరావతి : జీవితాన్ని ప్రభావితం చేసేది ఒక్కటేనని అది విద్య అని గుర్తించాలన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. చదువుతోనే మనిషిలో సంస్కారం అలవడుతుందని అన్నారు. విద్యతోనే వికాసం అలవడుతుందని, అది బతుకు దెరువు చూపించడమే కాకుండా సమాజంలో మనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకు వచ్చేలా చేస్తుందని అన్నారు నారా భువనేశ్వరి.
ద్రావిడ యూనివర్సిటీలో ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నారా భువనేశ్వరి . అనంతరం ద్రావిడ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు.
భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలంటే పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైనా సులభంగా మారి పోతుందన్నారు. కృషి లేకుండా విజయం సాధ్యం కాదని తెలుసుకుంటే మంచిదన్నారు. ఇవాళ టెక్నాలజీ ఎంతో మారి పోయిందని, దానిని సరైన సమయంలో గుర్తించి పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తే మీ చెంతకే జాబ్స్ వస్తాయని అన్నారు నారా భువనేశ్వరి. తన భర్తకు 75 ఏళ్లు దాటినా నేటికీ ఆయన 18 గంటలకు పైగా కష్ట పడతారని , మన కృషినే మనల్ని కాపాడుతుందని, అదే మనకు గుర్తింపును తీసుకు వచ్చేలా చేస్తుందన్నారు. శ్రమనే ఆయుధం, అదే మనకు బలం అని, దానిని నమ్ముకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.





