ఛాయ్ రాస్తా అవుట్ లెట్ సూప‌ర్

Spread the love

ప్ర‌శంసించిన నారా భువ‌నేశ్వ‌రి

చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి చిత్తూరు జిల్లాలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. జిల్లాలో నాలుగు రోజుల పాటు ప‌ర్య‌టిస్తారు. ఇందులో భాగంగా అన్ని వ‌ర్గాల వారిని క‌లుస్తున్నారు. క‌స్తూర్బాగాంధీ పాఠ‌శాల‌ను సంద‌ర్శించారు. అక్క‌డ విద్యార్థినిల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. చ‌క్క‌గా చ‌దుకోవాల‌ని హిత‌బోధ చేశారు. విద్య‌తోనే వికాసం క‌లుగుతుంద‌న్నారు. అక్క‌డి నుంచి బిగ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. స్వంతంగా బ‌స్సులో ప్ర‌యాణం చేశారు. తాను ఆధార్ కార్డు చూపించి టికెట్ తీసుకున్నారు. ఉచిత బ‌స్సు ప‌థ‌కం ఎలా ఉందంటూ ఆరా తీశారు. ఇందుకు మ‌హిళా ప్ర‌యాణీకులు సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆయ‌న మేలును మ‌రిచి పోలేమ‌న్నారు.

మ‌రో వైపు స‌ర్ ప్రైజ్ ఇచ్చారు నారా భువ‌నేశ్వ‌రి. ఓ మ‌హిళా కార్య‌కర్త పిలిచిన వెంట‌నే ఆమె ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబాన్ని ఆశ్చ‌ర్య పోయేలా చేశారు. తాజాగా ఒక కుటుంబానికి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే సంకల్పంలో భాగంగా డ్వాక్రా మహిళలచే ఏర్పాటు చేసిన ఛాయ్ రాస్తా అవుట్‌లెట్‌ను ముఖ్యమంత్రి సతీమణి ప్రారంభించారు. రుచి, శుచి, నాణ్యత ప్రధానంగా కార్పొరేట్ తరహాలో ఏర్పాటైన ఛాయ్ రాస్తా అవుట్ లెట్‌లో ఆమె మొదటి ఛాయ్‌ని కోనుగోలు చేశారు. చాయ్ రాస్తా అవుట్‌లెట్‌లో రుచి, శుచి చక్కగా ఉన్నాయని ఆమె ప్రశంసించారు. ఐఐఎం, ఐఐటి గ్రాడ్యుయేట్ల భాగస్వామ్యంతో రూపొందించిన చాయ్ రాస్తా చాలా సరికొత్తగా ఉందని అభినందించారు.

  • Related Posts

    రూ. 167.20 కోట్లకు అమ్ముడు పోయిన పెయింటింగ్

    Spread the love

    Spread the loveభార‌తీయ క‌ళా రంగంలో అరుదైన రికార్డ్ న‌మోదు న్యూఢిల్లీ : భార‌తీయ క‌ళా రంగంలో అరుదైన ఘ‌న‌త చోటు చేసుకుంది. ప్ర‌ముఖ చిత్ర‌కారుడు, దివంగ‌త రాజా ర‌వివ‌ర్మ గీసిన పెయింటింగ్ ఏకంగా రూ. 167.20 కోట్లకు అమ్ముడ పోయింది.…

    నితీశ్ కుమార్ కు జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ

    Spread the love

    Spread the loveఇటీవ‌లే సీఎం ప‌ద‌వి రాజీనామా బీహార్ : దేశ రాజ‌కీయాల‌లో సుదీర్ఘ‌మైన పాల‌నా అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందాడు మాజీ సీఎం నితీశ్ కుమార్. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా త‌ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *