నేత‌న్న‌ల‌ను ఆదుకోవాలి సబ్సిడీ విడుద‌ల చేయాలి

Spread the love

కాంగ్రెస్ స‌ర్కార్ ను డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత

వ‌న‌ప‌ర్తి జిల్లా : చేనేత కార్మికుల‌ను ఆదుకోవ‌డంలో స‌ర్కార్ వివ‌క్ష చూపిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం జాగృతి జ‌నం బాట‌లో భాగంగా వ‌న‌ప‌ర్తి జిల్లాలో ప‌ర్య‌టించారు. కొత్త‌కోట మండ‌ల కేంద్రంలోని వీవ‌ర్స్ కాలనీలో ఉన్న చేనేత కార్మికుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారి స‌మ‌స్య‌ల‌ను క‌విత‌కు విన్న‌వించారు. అనంత‌రం క‌ల్వ‌కుంట్ల క‌విత మీడియాతో మాట్లాడారు. గ‌తంలో బీఆర్ఎస్ హ‌యాంలో చేనేత‌ల‌కు సబ్సిడీ, ప‌నిముట్లు, పెన్ష‌న్ సౌక‌ర్యం క‌ల్పించార‌ని కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు తీరాక కేవ‌లం పెన్ష‌న్ మాత్ర‌మే ఇస్తూ స‌బ్సిడీ ఇవ్వ‌కుండా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు క‌విత‌.

చేనేత కుటుంబంలో ఒకరికి చేనేత పెన్షన్ ఇచ్చినా స‌రే సాధార‌ణంగా ప్ర‌తి నెలా ఇచ్చే పెన్ష‌న్ ను కూడా వ‌ర్తింప చేయాల‌ని డిమాండ్ చేశారు. నారాయ‌ణ‌పేట‌, కొత్త‌కోట‌, గద్వాల చీర‌లు దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందాయ‌ని నేటికీ మ‌హిళ‌లు ధ‌రిస్తున్నార‌ని కానీ వాటిని నేసే వారి ప‌రిస్థితి మాత్రం దారుణంగా ఉంద‌న్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. స‌రైన మార్కెట్ స‌దుపాయం లేద‌న్నారు. చీరలు నేసినప్పటికీ సొంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింద‌ని ఆవేద‌న చెందారు. దీంతో చాలా మంది నేత కార్మికులు కూలీకి వెళ్తున్నార‌ని అన్నారు. ప్ర‌భుత్వం వెంట‌నే ఆదుకోవాల‌ని, స‌బ్సిడీని వెంట‌నే రిలీజ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వ ప‌రంగా విరివిగా రుణాలు కూడా ఇవ్వాల‌న్నారు. నైపుణ్యం క‌లిగిన నేత‌న్న‌ల‌ను ఆదుకోక పోతే చేనేత క‌ళ అంత‌రించి పోయే ప్ర‌మాదం ఉంద‌న్నారు.

  • Related Posts

    ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : భ‌ట్టి విక్ర‌మార్క

    Spread the love

    Spread the loveప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా కూడా కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై అడుగ‌డుగునా విద్వేషం చిమ్ముతూ లేకి వార్త‌లు రాస్తూ వ‌స్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వాకంపై సీరియ‌స్ అయ్యారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌. తాను సింగ‌రేణి…

    కేసీఆర్, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి : రేవంత్ రెడ్డి

    Spread the love

    Spread the loveపాలేరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి షాకింగ్ కామెంట్స్ ఖ‌మ్మం జిల్లా : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మ‌రోసారి నోరు పారేసుకున్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా మాజీ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *