ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : భ‌ట్టి విక్ర‌మార్క

ప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా కూడా కామెంట్స్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై అడుగ‌డుగునా విద్వేషం చిమ్ముతూ లేకి వార్త‌లు రాస్తూ వ‌స్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వాకంపై సీరియ‌స్ అయ్యారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌. తాను సింగ‌రేణి కుంభ‌కోణంలో ఉన్నానంటూ ప్ర‌స్తావించడంపై తీవ్రంగా మండిప‌డ్డారు. నిరాధార వార్త‌లు రాస్తే తాట తీస్తామ‌న్నారు. ఇదే స‌మ‌యంలో త‌న‌కు స్నేహితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప‌రోక్షంగా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క‌. నా మీద అబద్ధాలు రాసిన ABN రాధాకృష్ణకు చంద్రబాబు మీద రేవంత్ రెడ్డి మీద అపారమైన ప్రేమ ఉండొచ్చు..లేదా నేను రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడుని కాబట్టి ఆయన మీద ఉన్న ద్వేషాన్ని నా మీద చూపిస్తూ విషపూరిత కథనాలు రాసి ఉండొచ్చు అని అన్నారు.

నేను గాలికి వచ్చిన రాజకీయ నాయకుడిని కాద‌ని అన్నారు మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌..40 ఏళ్లుగా సభ బయట సభ లోపల ప్రజల కోసం పోరాటం చేసి నిలబడ్డ వాడిన‌ని హెచ్చ‌రించారు. నీచమైన నికృష్టమైన దిగజారిన రాజకీయాల కోసం అబద్ధాలను తయారు చేసి పుకార్లను స్ప్రెడ్ చేసే బలహీనమైన వీక్ క్యారెక్టర్ నాది కాదని స్ప‌ష్టం చేశారు. ఆ విష‌యం రాధాకృష్ణ తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లిఆరు. వ్యక్తిగత కక్షలతో యజమానుల ఆదేశాలతో కథనాలు రాసే మీడియా దళారుల రాజకీయాలు నాకు బాగా తెలుస‌ని అన్నారు. నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలను ఆయుధాలుగా మార్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎక్కువ కాలం సాగవు అని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి దుష్ప్రచారాలతో నా పోరాటాన్ని ఆపలేరు నా స్వరాన్ని మూసేయలేరు అన‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *