విద్యా రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించిన స‌ర్కార్

Spread the love

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

హ‌ద‌రాబాద్ : గ‌త పదేళ్లలో విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి జరిగితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా నీరుగారుస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గత పదేళ్లలో ఏమీ జరగలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారానికి తెరతీసిందన్నారు. వారి అబద్ధాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వచ్చే నెల నుంచి పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులను సమీకరించి, ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గురుకులాల్లో కల్తీ ఆహారం మొదలుకొని, విద్యార్థుల ఆత్మహత్యల వరకు అనేక విషాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో విద్యార్థి విభాగం చేపట్టిన ‘గురుకుల బాట’తో ప్రభుత్వంలో కొంత చలనం వచ్చినప్పటికీ, అది కేవలం కాంగ్రెస్ నాయకుల నటనగానే మిగిలి పోయిందన్నారు. గురుకులాల దుస్థితిపై మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి సోషల్ మీడియా ఖాతా ఉండాలని, సమకాలీన రాజకీయాలపై యువత గట్టిగా స్పందించాలని కేటీఆర్ సూచించారు. “విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాలి. ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా విద్యార్థి గొంతుక బలంగా వినిపించాలి,” అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్లు కేవలం స్ధానిక సంస్ధలకే కాదని, విద్యా, ఉద్యోగ అవకాశాల్లోనూ రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని గుర్తు చేయాల‌న్నారు.

  • Related Posts

    ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న జ‌గ‌న్ : ర‌వికుమార్

    Spread the love

    Spread the loveమాజీ ముఖ్య‌మంత్రిపై మంత్రి గొట్టిపాటి షాకింగ్ కామెంట్స్ అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, ప‌ల్నాడు జిల్లా ఇంచార్జి గొట్టిపాటి ర‌వికుమార్. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు తెర లేపాడ‌ని, లా…

    జ‌గ‌న్ ప్రోద్బ‌లంతోనే దాడుల ప‌రంప‌ర‌ : ఎస్. స‌విత

    Spread the love

    Spread the loveకులాల మధ్య కొట్లాటకు కుట్ర‌ల‌కు తెర లేపారు శ్రీ స‌త్య సాయి జిల్లా : రాష్ట్రంలో దాడుల ప‌రంప‌ర‌కు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి కార‌ణ‌మ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *