రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లు : ఎస్. స‌విత‌

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన జౌలి శాఖ మంత్రి
అమ‌రావ‌తి : వ‌చ్చే ఏడాది సంక్రాంతి పండుగ వ‌ర‌కు చేనేత వ‌స్త్రాల‌పై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాష్ట్ర ఔళి, చేనేత , బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుని చిన్నారులతో పాటు ఆయా వయస్సుల వారికి అవసరమైన రెడీ మేడ్ చేనేత వస్త్రాలను ఆప్కో షో రూమ్ ల్లో విక్రయిస్తున్నామని వెల్ల‌డించారు. దీంతో చేనేత వస్త్రాల కొనుగోలు పెరిగినట్లు మంత్రి సవిత తెలిపారు.

చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో చేనేత బజార్లు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. త్వరలో విశాఖ, కర్నూలు, కడప వంటి నగరాలతో పాటు ఇతర జిల్లా కేంద్రాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు, బజార్లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా త‌మ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు.

  • Related Posts

    మెట్టూరు ఆన‌క‌ట్ట నుండి నీటిని విడుద‌ల చేసిన సీఎం

    చెన్నై : తమిళనాడు ముఖ్య‌మంత్రి తిరు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ మంగ‌ళవారం కావేరి డెల్టా జిల్లాలో ప‌ర్య‌టించారు. ‘వరి గిన్నె’గా ప్రసిద్ధి చెందిన కావేరీ డెల్టా జిల్లాల్లో ‘సాంబా’ పంట సాగుకు, కావేరీ పరీవాహక ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడానికి సేలం…

    రేపు విద్యుత్ వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్

    తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివ‌శంక‌ర్ లోతేటి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సెప్టెంబర్ 2వ తేదీన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *