పండ్ల తోట‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించాలి

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ స‌ర్కార్ మెరుగైన వ్య‌వ‌సాయ దిగుబ‌డి కోసం ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. సాగు అనేది దండుగ కాద‌ని అది పండుగ అని పేర్కొన్నారు. రైతుల‌ను ల‌క్ష‌లాధికారుల‌ను చేసే బాధ్య‌త స‌ర్కార్ తీసుకుంటుంద‌న్నారు. ఇప్ప‌టికే అన్ని వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం అనేక కార్య‌క్ర‌మాల‌ను తీసుకు రావ‌డం జ‌రిగింద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో పంట‌లు న‌ష్ట పోయిన రైతుల‌ను ఆదుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు సీఎం. రాయలసీమలో పండ్ల తోటల పెంపకం, సాగు సబ్సిడీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌ తదితర అంశాలపై మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వ పథకం పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై చర్చ జరిగింది. రాయలసీమలోని పండ్ల తోటల రైతుల ఆదాయం పెంచేందుకు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు సంబ‌ధిత అధికారుల‌ను. 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఉద్యోగుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట : సీఎం

    హైద‌రాబాద్ : త‌మ ప్ర‌భుత్వం ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యం కోసం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం కీలక మైలు రాయిని సాధించింది. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సమగ్ర ఆరోగ్య భద్రత ,…

    మ‌త‌ప‌ర‌మైన అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చొద్దు

    హైదరాబాద్ : మత పరమైన అంశాలకు సంబంధించిన హోంవర్క్ ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి బంధువు సుప్రియ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లో ఆమె తీవ్రంగా స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడారు. పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్న మా మేనల్లుడిని తీసుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *