ఓట్ల చోరీ వ‌ల్ల‌నే బీహార్ లో ఎన్డీఏ గెలుపు

Spread the love

కాంగ్రెస్ నేత స‌చిన్ పైల‌ట్ కామెంట్స్

బీహార్ : కాంగ్రెస్ సీనీయ‌ర్ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా బీహార్ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ కూట‌మికి త‌క్కువ సీట్లు రావ‌డం ప‌ట్ల ఆందోళ‌న చెందారు. ఇది పూర్తిగా ఎన్నిక‌ల సంఘం బీజేపీకి, ఎన్డీయే కూట‌మికి దాసోహం అయ్యింద‌ని, ఆ మేర‌కు లోపాయికారిగా స‌పోర్ట్ చేయ‌డం వ‌ల్ల‌నే ఇదంతా చోటు చేసుకుంద‌ని ఆరోపించారు. ఆదివారం స‌చిన్ పైల్ మీడియాతో మాట్లాడారు. దేశంలో SIR చాలాసార్లు జరిగింది, కానీ అంతకు ముందు SIR జరిగినప్పుడు, ప్రజల మనస్సులలో ఎటువంటి చర్చ లేదా భయం లేదన్నారు.

కానీ మొదటిసారిగా, ప్రజలు దీనితో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు స‌చిన్ పైల‌ట్… బీహార్‌లో, లక్షలాది మంది పేర్లను తొలగించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొనసాగుతున్న ప్రచారంలో, ప్రజలకు చాలా తక్కువ సమయం ఇవ్వబడిందని గుర్తు చేశారు. అనేక రాష్ట్రాల్లో, BLOలు ఆత్మహత్య చేసుకుంటున్నార‌ని వాపోయారు. మరికొందరు ఫిర్యాదు చేస్తున్నారని కానీ ఈసీ ప‌ట్టించు కోవ‌డం లేద‌న్నారు. వారు చాలా ఒత్తిడిలో ఉన్నారంటూ వాపోయారు. ఎన్నికల కమిషన్ నిష్పాక్షిక సంస్థగా పని చేయాలని సూచించారు స‌చిన్ పైల‌ట్. ఏ ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తోందని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్ర‌తి ఒక్క‌రు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

  • Related Posts

    రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేదే లేదు

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి క‌రీంన‌గ‌ర్ జిల్లా : జ‌గిత్యాల‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను పార్టీ మార‌డం ప‌క్కా అని అన్నారు.…

    ఊపిరి ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జల కోసం ప‌ని చేస్తా

    Spread the love

    Spread the loveఘనంగా హోం మంత్రి అనిత జన్మదిన వేడుకలు నక్కపల్లి : రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు నక్కపల్లి మంత్రి నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, అభిమానుల శుభాకాంక్షలతో వేడుకలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *