చేపట్టామన్న మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి : దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో షేర్ వాల్ టెక్నాలజీతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆదివారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట లో పురపాలక శాఖ మంత్రి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వర రావు తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న 960 టిడ్కో ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఒకేసారి భారీగా లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందించడం ఆనందంగా ఉందన్నారు. నిర్మాణం పూర్తయిన రోడ్లు,డ్రెయిన్లు, స్ట్రీట్ లైట్ల ప్రారంభం,పార్కుల అభివృద్ధి పనులను ప్రారంభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
68.5 లక్షల తో చేపట్టిన మున్సిపల్ ఆఫీస్ ఆధునీకరణ, సోలార్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిందన్నారు మంత్రి. మండపేట మున్సిపాలిటీ పరిధిలో 18 లక్షల వ్యయంతో చేపట్టిన ఫౌంటెయిన్ లు కూడా పని చేస్తాయన్నారు. మండపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు 5.95 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపామన్నారు. 2014-19 లో పేదలకోసం హై క్వాలిటీతో ఇళ్లు కట్టాలని తనకు అప్పగించారని చెప్పారు మంత్రి నారాయణ. ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు…ప్రతి తల్లి కుటుంబంతో ఆనందంగా ఉండేలా ఇళ్లు కట్టించాలని స్పష్టం చేశారన్నారు. అమరావతి నిర్మాణం కోసం విదేశాలకు వెళ్లినప్పుడు పేదల ఇళ్ల నిర్మాణం అధ్యయనం చేశానని తెలిపారు . షేర్ వాల్ టెక్నాలజీ తో పేదలకు ఇళ్లు కట్టింది ఏపీ మాత్రమేనని చెప్పారు.






