విజ‌య‌వాడ‌లో ఆవ‌కాయ్ సినిమా, సాహిత్య ఫెస్టివ‌ల్

Spread the love

జ‌న‌వ‌రి 8,9,10వ తేదీల‌లో నిర్వ‌హ‌ణ

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌యారిటీ ఇచ్చేలా కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌ని మంత్రి కందుల దుర్గేష్ ను ఆదేశించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే యాక్ష‌న్ ప్లాన్ కూడా త‌యారు చేశారు. ఇదే క్ర‌మంలో యోగాంధ్ర పేరుతో విశాఖ‌లో రూ. 94 కోట్లు ఖ‌ర్చు చేసి స‌క్సెస్ చేశారు. భారీ ఎత్తున జ‌నం యోగాంధ్ర‌లో పాలు పంచుకున్నారు. తాజాగా మ‌రో కీల‌క‌మైన భారీ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు కందుల దుర్గేష్. ఈ మేర‌కు రాష్ట్ర సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ మేర‌కు ఆవ‌కాయ్ పేరుతో ఏకంగా ఫెస్టివ‌ల్ ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు మంత్రి .

సోమ‌వారం ఇందుకు సంబంధించి ఉన్న‌తాధికారులు అజ‌య్ జైన్, అమ్రాపాలి కాటా తో క‌లిసి కందుల దుర్గేష్ ఫెస్టివ‌ల్ కు సంబంధించి పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఇదిలా ఉండ‌గా ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహితోత్సవంపై పలు అంశాలను వివరించారు కందుల దుర్గేష్. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో దీనిని నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. జ‌న‌వ‌రి 8,9,10 తేదీల‌లో విజ‌య‌వాడ‌లోని పున్న‌మి ఘాట్, భ‌వానీ ఐ ల్యాండ్ ల‌లో మూడు రోజుల పాటు ఈ ఫెస్టివ‌ల్ జ‌ర‌గ‌నుంద‌ని స్ప‌ష్టం చేశారు కందుల దుర్గేష్. కాగా ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్ర‌వేశం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు.

  • Related Posts

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    జూన్ 8వ తేదీ లోపు ప‌నులు పూర్తి చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హైద‌రాబాద్ : వ‌చ్చే జూన్ 8వ తేదీ లోపు ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *