ఊహించని షాక్ కు గురైన తనూజ
హైదరాబాద్ : బిగ్ బాస్ -9 రియాల్టీ షో కథ ముగిసింది. గత కొంత కాలంగా జనాలను ఆదరిస్తూ వచ్చింది ఈ షో. రేటింగ్ లో సైతం చోటు దక్కించుకుంది. దీనిని నిర్వహిస్తూ వస్తున్నారు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున. విన్నర్ గా నిలిచారు జవాన్ గా పని చేస్తున్న కళ్యాణ్ పడాల. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఎవరూ ఊహించని రీతిలో కన్నడ నాట అత్యంత జనాదరణ కలిగిన , పేరు పొందిన నటిమణి తనూజ పుట్టస్వామి రన్నరప్ గా నిలిచింది. చాలా మంది తనే విన్నర్ అవుతారని ఆశించారు. బిగ్ బాస్ -9 రియాల్టీ షో గ్రాండ్ ఫినాలే ఓటింగ్ నిర్వహించగా రెండు రోజులలో టాప్ లో కొనసాగుతూ వచ్చింది . కానీ అనుకోకుండా కళ్యాణ్ పడాల ఆ తర్వాత దూసుకు వచ్చింది.
మూడో స్థానంలో సరిపెట్టు కోవాల్సి వచ్చింది ఇమ్మాన్యూయెల్. తను కూడా కీ రోల్ పోషించాడు. చివరి దాకా తను కూడా పోటీ పడ్డాడు. కానీ పడాల టాప్ లో కొనసాగగా తనూజ రెండో ప్లేస్ కు పరిమితమైంది. తన స్వస్థలం బెంగళూరు. మార్చి 5, 1979లో పుట్టింది. కన్నడ చలన చిత్ర పరిశ్రమలో ఆరంగ్రేటం చేసింది. ఆ తర్వాత సినిమాలతో పాటు సీరియల్స్ లలో కూడా నటించింది మెప్పించింది తనూజ పుట్టస్వామి. విచిత్రం ఏమిటంటే తనను అంతా అక్కడ ముద్దుగా తనూజ గౌడ అని పిలుచుకుంటారు. ఇక తెలుగులో మోస్ట్ పాపులర్ అయిన ముద్ద మందారం సీరియల్ లో కీ రోల్ పోషించింది. తనను అందరూ తెలుగు అమ్మాయి అని అనుకుంటారు. ఒక రకంగా విన్నర్ కావాల్సిన తనూజ అనుకోకుండా రన్నరప్ గా నిలవాల్సి వచ్చింది.








