మాజీ మంత్రి కేటీఆర్ సీఎంపై షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలు మాట్లాడటం దారుణమన్నారు. జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా అంటూ మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి..సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూయడం పట్ల మండిపడ్డారు. తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. అడ్డంగా దొరికిపోవడం..ఆగమాగం కావడం..అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా అంటూ ఎద్దేవా చేశారు. నీటి హక్కులపై రాజీపడ్డ నీ నిర్వాకాన్ని బయట పెడితే తట్టుకోలేక..చిల్లర డైలాగ్లతో చిందులు తొక్కుతున్నావంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్.
విధ్వంసక పాలనతో ప్రజలను చావ గొడుతున్నవు..వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నావు అయినా నీకు సంస్కారం లేకుండా పోయిందన్నారు. సభ్యత, సంస్కారంలేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా ..ఛీకొడుతున్నా ఇంకా మారక పోవడం దారుణమన్నారు. పట్ట పగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు నీవు..అదే నీ స్థాయి అని స్పష్టం చేశారు. పనికి మాలిన శపథాలు చేయడం..పత్తా లేకుండా పారిపోవడం నీకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎద్దేవా చేశారు. శాసన సభలో..జనసభలో ప్రతిచోటా కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడతాం అని హెచ్చరించారు






