సంచలన ప్రకటన చేసిన ఈవో సింఘాల్
తిరుమల : వరుస సెలవులు రావడంతో తిరుమలకు పోటెత్తారు భక్త బాంధవులు. దీంతో ఎక్కడ చూసినా కిట కిట లాడుడుతోంది తిరుపతి, తిరుమల. దీంతో ముందస్తుగా ఏర్పాటు చేసిన శ్రీవాణి టికెట్ల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్. ఇందులో భాగంగా రద్దీని పురస్కరించుకుని మూడు రోజుల పాటు శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీ రద్దు చేసినట్లు ప్రకటించారు.
తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29వ తేదిలకు (శని, ఆది, సోమవారం) సంబంధించి శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీని తాత్కాలికంగా నిలిపి వేసినట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ లో, తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్లు జారీ చేయ బోవడం లేదని స్పష్టం చేశారు ఈవో. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన ప్రణాళికలను రూపొందించు కోవాలని ఈ సందర్భంగా భక్తులకు అనిల్ కుమార్ సింఘాల్ విన్నవించారు.







